Kaadhal kalave
Kaadhal kalave shortfilm by Surya mahankali
Published on 10 Oct 2020.
Cast: bhargav nallan& jahnavi
Story -screenplay- direction: Surya mahankali
Dialouges & lyrics:chelamaji
Music: Shravan bharadhwaj.
DOP:Satish rajaboina
Di:Karthik, netha siliveru
Executive producer:Harsha adhwaith.
Singer: sai Krishna
Lyric video : Prema sai chenna
Title animation: subashini.
SFX&mixing: veeru bandaru
Keyboard: raghava
Piano: kenith
Posted by: manohar
User Views
A new way to propose...
థ్రిల్లర్ కి రివ్యూ రాశా, డ్రామా కి రివ్యూ రాశా కానీ ఎది చిన్న వెలితి . ఆలోచించగా, ఆలోచించగా తెలిసింది ఏంటంటే ఇప్పటి దాకా ఒక్క లవ్ స్టోరీ కి కూడా రివ్యూ రాయలేదు. ఫిక్స్ అయిపోయా లవ్ స్టోరీ కి రివ్యూ రాద్దాం అని . ప్రేమ , ఈ కాన్సెప్ట్ తో ఇంకో వంద సంవత్సరాలు సినిమాలు తీసిన మన వాళ్ళ దాహం తీరక పోవచ్చు అని నాకు అనిపిస్తుంటుంది.ప్రేమ కథలు అంటే అంత మక్కువ . సూర్య మహంకాళి గారు అది వరకే షార్ట్ ఫిల్మ్ తీసినా, కాదల్ కలవే ప్రత్యేకం. మనం కాదల్ కలవే అన్న పేరు వినగానే అర్థం అయిపోతుంది ఇందులో భాషకి సంబంధించిన విషయం ఎది ఉంది అని అర్థం అవుతుంది. కాదల్ అన్నది తమిళ్ పదం , షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ కూడా తమిళ్ , హీరో అమ్మాయిని పడెయ్యతానికి కూడా తమిళ్ లాంగ్వేజ్ బాగా ఉపయోగ పడుతుంది. షార్ట్ ఫిల్మ్ పేరు లో ఉన్న subtext అది.ఈ షార్ట్ ఫిల్మ్ లో జరిగే coincidence ఎవరో ప్లాన్ చేసినట్టే జరుగుతుంది, కానీ ఎది యాదృచ్చికం . షార్ట్ ఫిల్మ్ మొదలు అవ్వడం పాట తో మొదలు అవుతుంది. అండ్ శ్రవణ్ భరద్వాజ్ గారు అందించిన మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ షార్ట్ ఫిల్మ్ నీ వేరే లెవెల్ కి తీసుకెళ్లడానికి ఆ పాట చాలా బాగా ఉపయోగ పడింది. అప్పటికే కల్కి, మంచు కురిసే వేళలో సినిమా లకి సంగీతం అందించింది మంచి ఫామ్ లో ఉన్న శ్రవణ్ భరద్వాజ్ గారు ఈ షార్ట్ ఫిల్మ్ కి కూడా ద బెస్ట్ ఇచ్చారు.ఇంకా కథ లోకి వెళ్తే ఒక అబ్బాయి రోజు ఒక అమ్మాయి నీ ఫాలో అవుతుంటాడు.అమ్మాయి కూడా ఇతను ఫాలో అవుతున్నాడు అని గమనిస్తుంది.కానీ ఏమీ అనదు ఒక రోజు అమ్మాయి పడి పొబో తింటే అబ్బాయి పట్టుకుంటాడు . ఆ తర్వాత రోజు ఆమ్మయే డైరెక్ట్ గా అబ్బాయి దగ్గరికి వచ్చి కాఫీ కి వెల్దాం అని అడుగుతుంది . ఆ తర్వాత జరిగే పరిణామాలు వాళ్ళిద్దర్నీ ఎలా కలిపాయో షార్ట్ ఫిల్మ్ చూసి తెలుసు కోవాల్సిందే.
అమ్మాయి చేతనే ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయించే సీన్ సూపర్ , అస్సలు లేట్ చెయ్యకుండా చూసేయండి.......
Review By: manohar