filmOYA
  • Post a
    Posting Shortcuts
    Shortfilm
    Sf Review
    Blog Post
    Video
    Wanted
    Audition
  • Login

    • Home

    • Trending

    • Videos

    • Blog

      • Sidebar Style 1
      • Overlay Sidebar
      • Compact Sidebar
      • Static Sidebar
      • Icon Menu
    • Reviews

    • Shortfilms

      • Basic Form
    • Interviews

    • Jobs/Wanted

    • Jobs/Auditions

    • Profiles

      • JQVMap
    • Login

    I Like It This Way - An Independent Film by Prema Malini Vanam || Archana || Shivakumar


    "ఐ లైక్ ఇట్ థిస్ వే " అనేది మనసు కు మనిషి కి మధ్య కొత్త దారి.

    ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే " ఇది 56 నిముషాల ఇండిపెండెంట్ ఫిలిం మాత్రమే అనుకుంటే పొరపాటే ... ఎన్నో బుర్రల్లో ఉన్న ఆలోచనల చీకటి పొరలను తొలగించే వెలుగు కిరణం. కన్నీళ్లకు జెండెర్లు ఉండవు , ప్రేమకు అవధులు ఉండవు, కండిషన్స్ పెడుతూ ఉంటె అది ప్రేమే అవ్వదు అని సున్నితంగా చెప్పిన ఇండిపెండెంట్ ఫిలిం ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే". కాలం మారుతుంది కాలం తో పాటు మనుసులు మారాలి . పురుషాధిక్యం ,స్త్రీ ఆధిక్యం అంటూ ఏమి లేకుండా మనుషులు ,మనసులు వాటి ఊసులు ఇవే కనిపిస్తాయి ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే " ఇండిపెండెంట్ ఫిలిం లో .రెండే పాత్రలు తమ అంతరంగాలని పంచుకుంటూ 56 నిముషాలు ప్రయాణిస్తాయి .

    ఇందులో ప్రేమ ఉంటుంది ..తమ మనసుకి నచ్చిన వారు దొరికారు అనే సంతృప్తి ఉంటుంది ..ఎక్కడ వెళ్ళిపోతారో అనే బాధ ఉంటుంది .ప్రేమ ఉన్న చోట బాధ ఉంటుంది అని ఎవరో కవి అన్నట్టు ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే " లో కూడా రెండు ట్రావెల్ అవుతూ ఉంటాయి . జీవితం మీద క్లారిటీ ఉండి తమ లైఫ్ పార్టనర్ ఎలా ఉంటె తమకు నచ్చుతుందో అనే క్లియర్ ఐడియా ఉన్న రెండు మెచూర్డ్ మనసుల కధే ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే ". .

    సున్నితమైన కథను తీసుకున్న డైరెక్టర్ ప్రేమమాలిని వనం కధకు తన డైరెక్షన్ విజన్ తో న్యాయం చేసారు . చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని కూడా నటీనటుల నుండి రాబట్టడం లో డైరెక్టర్ ప్రేమ మాలిని సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి .తాను రాసుకున్న కాదని సోషల్ పాయింట్ ని జోడించి చక్కని నరేషన్ ఇచ్చి ఆడియన్స్ కి "ఐ లైక్ ఇట్ థిస్ వే " రీచ్ అయ్యేలా చేసారు డైరెక్టర్ .

    నటీ నటులు గా అర్చన ,శివ ఇద్దరు స్టోరీ ని తమ యాక్టింగ్ తో రసవత్తరంగా ప్రెజెంట్ చేసారు . అందమైన ఫ్రేమ్స్ తో కెమెరా పనితనం లో సాయి సంతోష్ తన బాధ్యతను నిర్వర్తించాడు .56 నిముషాలు ఇద్దరు మనుషుల మధ్య సంభాషణలు రాయడం అంటే కత్తి మీద సామే ,ఆలా అని డైలాగ్స్ కామెడీగా ఉండకూడదు, సబ్జెక్టు ని డిస్టర్బ్ చెయ్యకూడదు. ఇవి దృష్టిలో పెట్టుకొని చక్కటిన్యాచురల్ వే లో డైలాగ్స్ ని అందించాడు గంగాధర్ అద్వైత. ఆసక్తిగా చూస్తే ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే " ఇండిపెండెంట్ ఫిలిం మన ఆలోచన ధోరణిని కొంచం ఐన మార్చేస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు....

    Score: 88%

    • Privacy Policy
    • Sitemap
    2019, made with by filmOYA