filmOYA
  • Post a
    Posting Shortcuts
    Shortfilm
    Sf Review
    Blog Post
    Video
    Wanted
    Audition
  • Login

    • Home

    • Trending

    • Videos

    • Blog

      • Sidebar Style 1
      • Overlay Sidebar
      • Compact Sidebar
      • Static Sidebar
      • Icon Menu
    • Reviews

    • Shortfilms

      • Basic Form
    • Interviews

    • Jobs/Wanted

    • Jobs/Auditions

    • Profiles

      • JQVMap
    • Login

    ...
    Originals

    ఇంటర్వ్యూ విత్ డైరెక్టర్ వీ జయశంకర్

    ...
    Kiranmyee Deram
    Jan 02, 2018
    4229

    God must be Crazy, Half Girl Friend, Happy Ending లాంటి సందేశం తో కూడుకున్న షార్ట్ ఫిలిమ్స్ ని తీయడంలో, యూట్యూబ్ లో టాప్ మోస్ట్ వ్యూస్ షార్ట్ ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్స్ లో జయశంకర్ ముందుంటాడు. తీసినవి ఆరు షార్ట్ ఫిలిమ్స్ అయిన తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అతి త్వరలో పేపర్ బాయ్ అనే ఫీచర్ ఫిల్మ్ తో మన ముందుకు రానున్న జయశంకర్ తో కాసేపు మాట్లాడేద్దం మరి!

    Q) ఇంత వరకు మీరు తీసిన షార్ట్ ఫిలిమ్స్ అన్నిటికీ మంచి ఆదరణ వచ్చింది ..ఏం అనిపిస్తుంది ?

    చాలా హ్యాపీ గా వుంటుంది ..మన వర్క్ కి గుర్తింపు వస్తే అంత కంటే కావలిసింది ఎం వుంటుంది ..

    Q) మీ షార్ట్ ఫిలిమ్స్ లు చుస్తే డైరెక్షన్ ఎంత బాగుంటుందో, మాటలు అంత కంటే బాగుంటాయి ..అలాంటి మాటలు మీరు ఎలా రాయగలరు ?

    మాటలు కోసం మాటలు ఎపుడు రాయలేదు .. క్యారెక్టర్ అలా మాట్లాడుతుంది అంతే ..

    Q) రీడింగ్ , రైటింగ్ , దర్శకత్వం లో దేనికి మొదటి ప్లేస్ ఇస్తారు ?

    రీడింగ్ కి

    Q) మీ రైటింగ్ స్టైల్ లో ఎక్కువ ఫిలాసఫీ కనబడుతుంది ..ఎందుకు ?

    నేను ఎక్కువ గా ఫిలాసఫీ కి సంబందించిన బుక్స్ చదువుతా అండీ ..బహుశ ఆ టచ్ ఉండి వుంటుంది.

    Q) మీకు ఇష్టం అయిన ఫిలాసఫర్ ?

    Alfred north whitehead , Immanuel kant , Ishawar Chandra vidyasagar , Albert kamus ..

    Q) మీకు ఇష్టం అయిన బుక్ ?

    చాలా ఉన్నాయి.ఇంటర్వ్యూ అంతా నేను చెప్పే బుక్స్ నేమ్స్ తో నిండి పోతుంది.

    Q) మీ బ్యాక్ గ్రౌండ్ 

    ఇంజినీరింగ్ చదివాను.. తర్వాత కొన్ని రోజులు జాబు చేశా..తర్వత సినిమా ల సైడ్ వచ్చా ..

    Q) ఫ్యూచర్ లో మీ నుండి ఎలాంటి సినిమా లు ఆశంచవచ్చు?

    నాకు నచ్చిన అంశాలు , నేను నమ్మిన సిద్దంతాలు వుంటాయి ..

    Q) హాఫ్ గర్ల్ ఫ్రెండ్ 2 ఎపుడు రిలీజ్ చేస్తారు ?

    హాఫ్ గర్ల్ ఫ్రెండ్ పార్ట్ 2 షూట్ వెరీ లాంగ్ బ్యాక్ కంప్లీట్ అయింది ..షార్ట్ ఫిలిం రెడీ గా వుంది ..అందులో వున్నా కంటెంట్ ఫీచర్ ఫిలిం కి సెట్ అవుతుంది అని షార్ట్ ఫిలిం ని రిలీజ్ చేయలేదు ..

    Q) మీ షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ అందం గా వుంటారు ..మీరు తీసుకొనే జాగ్రత లు ఏంటి ?

    వాళ్ళు అందం గా వుంటారు కాబట్టే నేను తీసుకుంటా ..స్పెషల్ గా నేను చేసింది ఏం లేదు అండీ!

    Q) మీ అన్ని షార్ట్ ఫిలిమ్స్ లో అరిస్ట్ ల పెర్ఫార్మెన్స్ చాలా బాగుటుంది ..మీరు అర్టిస్ట్ లకి ఇచ్చే సూచనలు ఏంటి ?

    నేను అర్టిస్ట్ లని ఎప్పుడూ డైరెక్ట్ చేయను..సీన్ చెప్పి ఒదిలి వేసే వాడిని, వాళ్ళని కరెక్ట్ మాత్రం చేస్తా..

    Q) మీ షార్ట్ ఫిలిమ్స్ చాలా బోల్డ్ గా వుంటాయి అని అనేవరకి మీ ఎం చెపుతారు ?

    ఏమీ చెప్పను!!! వాళ్ళకి అలా అర్థం అయింది అని అనుకుంటా ..

    Q) మీ షార్ట్ ఫిలిమ్స్ లో క్యారెక్టర్స్  చాలా బలం గా వుంటాయి ..ఓపెన్ గా నిజాలు మాట్లాడుతాయి ? ఎందుకు ?

    నిజ జీవితం లో మనషులు చాలా కారణాల వాళ్ళ ఎక్కువ గా నిజాలు మాట్లాడలేము ..కనీసం సినిమా లో క్యారెక్టర్ అయిన మాట్లాడితే బాగుటుంది అని ..

    Q) ఫీచర్ ఫిలిం చేస్తున్నారు కదా ..ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేయరా ?

    షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ లు తప్పకుండా చేస్తా ..బట్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ కి ఆర్టిస్టులు దొరకడం చాలా కష్తం అయింది ..

    Q) ఇంతకి మీరు చేస్తున్న పేపర్ బాయ్ ఎక్కడి వరకి వచ్చింది

    Shooting కంప్లీట్ అయింది ..త్వరలో ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం ..

    Q) ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన వాళ్లలో మీకు బాగా నచ్చిన టీం?

    నా షార్ట్ ఫిలిమ్స్ అన్నిటికి ఒకే టీం వర్క్ చేసింది . నాని లుక్క గారు ఎడిటింగ్ , పి.వి.ఆర్ రాజ గారు మ్యూజిక్ , శివ ప్రసాద్ కెమెరా...బట్ టీం అంత ఎంజాయ్ చేస్తూ చేసిన షార్ట్ ఫిలిమ్స్ ది గాడ్ మస్ట్ బి క్రేజీ , హ్యాపీ ఎండింగ్..

    Q) మీ జర్నీ లో మీ టీం సపోర్ట్ ఎంత వుంది ?

    99% క్రెడిట్స్ నా టీం కి వెళ్తుంది ...నాని లుక్క(ఎడిటర్) , పి వి ర్ రాజ(మ్యూజిక్) , శివ ప్రసాద్(కెమెరా), మేము నలుగురం ఒక టీం గా వుంటూ షార్ట్ ఫిలిమ్స్ చేసాం .... నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ కి మంచి పేరు వచాయి అంటే ఈ ముగ్గురి వల్లే..నేను ఎపుడు కాల్ చేసిన నా కోసం వాళ్ళు రెడీ గా వుంటారు ..ఒక టీం గా వుంటూ ఫీచర్ ఫిలిమ్స్ కూడా తీస్తాం ..

    Q) మీ షార్ట్ ఫిలిమ్స్ లో అంతర్లీనంగా ఒక సందేశం ఉంటది... కావాలనే అలాంటి కథలు ఎంచుకుంటారా? లేక యాదృచ్చికంగా అలాంటి కథలు వస్తాయా?

    కథ లో కామెడీ వుంటే నవ్వుకుంటారు .. సందేశం వుంటే చెప్పుకుంటారు ..రెండు వుంటే సినిమా నిలిచిపోతుంది ..అందుకే కామెడీ తో పాటు ఏదో ఒక సందేశం వుండాలి అని అనుకుంటాను.

    Q) అప్పటి జయశంకర్ కి ఇప్పటి జయశంకర్ కి తేడా ఏమిటి?

    వెయిట్ ఒక 5kgs పెరిగాను ..హెయిర్ కొంచెం వైట్ అయింది ..హహహ

    Q) హహహ! మొదటి రోజు పేపర్ బాయ్ సెట్ లో ఎలా అనిపించింది?

    అందరితో నాకు ఇంతకు ముందే పరిచయం వాళ్ళ కొత్త గా అనిపిచలేదు ..టీం సపోర్ట్ వుండటం వాళ్ళ హ్యాపీ గా చేసుకున్నాం ..

     

    Q) అసలు పేపర్ బాయ్ అవకాశం ఎలా వచ్చింది?

    సంపత్ నంది గారి ఫ్రెండ్ మురళి మమ్మి లా గారు నా షార్ట్ ఫిలిమ్స్ చూసి సంపత్ గారికి ఇంట్రడ్యూస్ చేసారు .అయన టీం లోకి వర్క్ చేయమని చెప్పారు ..నా వర్క్ నచ్చి పేపర్ బాయ్ అవకాశం ఇచ్చారు ..

    Q) మీ షార్ట్ షార్ట్ ఫిలిమ్స్ ని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మరియు మణి రత్నం గారు చూసి మెచ్చుకునారు కదా ? ఎం అనిపిచింది

    చాలా హ్యాపీ గా అనిపిచింది ..ఎందుకు అంటే ఇద్దరు నేను అభిమనించే వారు...

    Q) ఈ మధ్య షార్ట్ ఫిలిమ్స్ చుస్తే ఎక్కువ లవ్ స్టోరీస్ యే కనిపిస్తున్నాయి కదా! షార్ట్ ఫిలిమ్స్ లో ఎందుకు ఎక్కువ ఆ జానర్ ని తీస్తున్నారు?

    నాకు తెలిసి ప్రతి ఫిలిం మేకర్ కి ఒక లవ్ స్టొరీ వుంటుంది ...ఆ స్టొరీ నే కథలు రాయడానికి స్ఫూర్తి....ఎవరైనా వాళ్ళకి రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీస్ నే తీయాలని అనుకుంటారు ..లవ్ స్టోరీస్ ఎక్కువ ఉండటానికి ఇది ఒక రీసన్ అనుకుంటున్నాను.

    Q) షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్?

    సలహా ఇచ్చే స్థాయి లో లేను ..ఏం పని చేసిన ఏకాగ్రత తో ఒపిక గా పట్టుదల తో చేస్తే బాగుటుంది ..

    Q) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ?

    ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను.

    Q) మీకు పుస్తక పఠనం తో పాటు పుస్తక రచన కూడా చేశారు అని విన్నాము!
    అవునండి, బుక్ నేమ్ వచ్చి - WHY MEN LOVE BITCHES పూర్తిగా అమ్మాయిల భావాల మీద ఉంటుంది. రియాలిటీ గా ఉంటుంది.

    Q) సో బుక్ రిలీస్ చేస్తున్నారా లేక మూవీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?
    వెబ్ సిరీస్ అనుకుంటున్నాము.

    మీ పేపర్ బాయ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము
    థ్యాంక్స్ అండి

    ఇదండీ ట్రెండ్ సెట్టర్ జయశంకర్ గారితో కొన్ని విశేషాలు. పేపర్ బాయ్ రిలీస్ అవ్వగనే ఆ విశేషాలతో జయశంకర్ గారితో మళ్ళీ కలుస్తాం.

     

     


    • Privacy Policy
    • Sitemap
    2019, made with by filmOYA