గురువు అంటే రోజు మన ముందుకి వచ్చేసి, పాఠాలు చెప్పేసి, తీపి కబురులు పంచేసి, కొండంత ధైర్యాన్నీ నింపేసి, అలా చేసే వాళ్లే గురువు అని అనుకుంటే అది వాళ్ల చాదస్తం.
//గురువుకి ప్రేమతో..//
గురువు అంటే
రోజు మన
ముందుకి వచ్చేసి,
పాఠాలు చెప్పేసి,
తీపి కబురులు పంచేసి,
కొండంత ధైర్యాన్నీ నింపేసి,
అలా చేసే వాళ్లే గురువు అని అనుకుంటే అది వాళ్ల చాదస్తం.
ఏకలవ్యుడు ,ద్రోణాచార్యుడు గారి విగ్రహం చేసుకొని తన గురువు గా భావించి,తన స్వతహాగా విద్యలు నేర్చుకున్నాడు గురువు సమక్షం లేకుండా.
నా గురువు "Trivikram Srinivas"గారు...
ఆయన ఏరోజు నా తరగతికి రాలేదు,
ఆయన నన్ను ఏనాడు చూడలేదు,
ఆయనతో ఒక మాటకుడా మాట్లాడలేదు,
అయినాగాని నేను అతడిని నా గురువు గారు అనే భావిస్తా.
ఒక వ్యక్తిని గురువు అని పిలవాలి అంటే అతడు
మనకి ఉన్న పొగరుని,
మనకి ఉన్న గర్వాని,
మనకి ఉన్న అహంకారాన్ని,
వీటన్నిoటిని అణగ తొక్కగల వారై ఉండాలి.
ఆయన మాటలతో
రాయిని కూడా కదిలించగలరు..
శత్రువులని కూడా ఓడించగలరు..
రావణాసురుడిని కూడా వనికించగలరు..
ఆయన పేరు కన్న ముందు ఆయన అక్షరం పరిచయం. పొలం లో విత్తనాలు వేస్తే భూమి ఎంత సంతోష పడుతుందో నాకు ఆయన మాటలు వింటే అంతే.
విడిపోయిన స్నేహితులు,
వదులుకున్న బంధాలు,
వద్దు అని అనుకున్న మనుషులు,
మళ్ళీ తిరిగి వస్తారు.
అతడు పట్టే కలం..
అతడితో రాయించుకునే కాగితం..
అతడు రాసే అక్షరం..
అతడు పలికే పదం..
వాటికై అవే పూర్వజన్మ సుకృతం గా భావిస్తాయి.
ఆయన రాసే వాక్యం జీవిత సత్యం.
పంచులా.?? గుర్తుపెట్టుకోలేనన్ని..
ప్రాసాలా.?? పంచుకోలేన్నన్నీ..
డైలాగులా.?? మరచిపోలేన్నన్నీ..
ఆయన రాసిన డైలాగ్స్ కనీసం కొన్ని పాటించిన ,బంధువుల ప్రేమానురాగాలు,ప్రేమవ్యవహారాలు,మనిషికి ఇచ్చే విలువలు ఇలాంటివి ఉండేవి కదా.!కొంత మంది లో నైనా....
"సంపాదించడం చేత కాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు"
"తండ్రికి,భవిష్యత్తు కి భయపడని వాడు జీవితం లో పైకి రాలేడు"
"విడి పోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది"
"దెయ్యం కంటే భయం మహా చెడ్డది అండి"
"ఒక మనిషిని మనం ప్రేమిస్తే,వాళ్ళు చేసే తప్పు ని కూడా మనం క్షమించగలగాలి"
ఇలాంటివి లెక్కలేనన్ని చెప్పి,కొన్ని కోట్ల హృదయాలలో స్థానాన్ని దక్కించుకున్నారు.
కన్నీళ్ళు పెట్టించగలరు..
పులకింతలు తెప్పించగలరు..
మీరు నాతో
అక్షరాలు దిద్దిoచలేదు..
పదాలు పలికించలేదు..
అయిన మీరు నాకు గురువు కాకుండా ఉండలేరు..
తరగతిలో చెప్పిన పాఠాలు మార్కుల కోసం అయితే
మీరు చెప్పే పాఠాలు మా జీవితాల మార్పుల కోసం..
నేను రాసే ప్రతి పదం లో మీ ప్రభావం ఎంత ఉందో చెప్పనక్కరలేదు.
TagLine:"క్లారిటీ ఉన్న వ్యక్తి"
–Saikumar Devendla
Interview With The Creators Of Geetha Subramanyam
Note
Short film industry loni anni vishayalanu mariyu, andarini feature cheyyali annadi maa aim. Miku telisina films kani, cast and crew gani maa ScrollNew FB page lo message pettandi.
If you wish to contribute mail us at info@scrollnew.com