filmOYA
  • Post a
    Posting Shortcuts
    Shortfilm
    Sf Review
    Blog Post
    Video
    Wanted
    Audition
  • Login

    • Home

    • Trending

    • Videos

    • Blog

      • Sidebar Style 1
      • Overlay Sidebar
      • Compact Sidebar
      • Static Sidebar
      • Icon Menu
    • Reviews

    • Shortfilms

      • Basic Form
    • Interviews

    • Jobs/Wanted

    • Jobs/Auditions

    • Profiles

      • JQVMap
    • Login

    ...
    Suggestions

    Too much ego can ruin your life|| Ayyappanum Koshiyum || Quarantine Suggestion By Haribabu Maddukuri

    ...
    Haribabu Maddukuri
    Apr 03, 2020
    2488

    అయ్యప్పనుమ్ కోషియుం..

    మలయాళం సినిమా.. మన రణంలో విలన్గా చేసిన బిజూమీనన్, పృథ్వీరాజ్లు హీరోలు..

    --------------------------------------

    అది కేరళ, తమిళనాడు బోర్డర్లో కొండలతో నిండిన ఓ అభయారణ్య ప్రాంతం.. పేరు అట్టప్పడి..

    ఆబ్కారీ ఆంక్షలున్న ఆ అట్టప్పడి అటవీప్రాంతంలో ఓ అర్ధరాత్రిపూట పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు కల్సి జాయింట్ గస్తీ నిర్వహిస్తూండగా కొచ్చిన్ నుంచి ఊటీ వైపు వెళ్తున్న ఓ ల్యాండ్ క్రూజర్ బండిని పట్టుకుంటారు.. తెరిచి చూడబోతే పరిమితికి మించి 12 ఫుల్ మద్యం బాటిళ్లు ఉంటాయి..

    నిబంధనలకు విరుద్ధంగా అంత ఆల్కహాల్ తీసుకెళ్తున్నారేంటీ అని ప్రశ్నించగా బండి ఓనర్ కోషీ దురుసుగా పోలీసుల మీద చెయ్యి చేసుకోవడంతో ఎస్సై అయ్యప్పన్ రంగప్రవేశం చేసి కోషీని చెంపదెబ్బ కొట్టి స్టేషన్కి తీసుకొచ్చి కుర్చోబెడతాడు..

    కోషీ సెల్ తీసుకుని కాంటాక్ట్స్ చూడగా అందులో మాజీసీయం దగ్గరనుంచి డీ.ఐ.జీ. వరకూ కాస్త పెద్ద తలకాయల నెంబర్లే సేవ్ చేసి ఉండటంతో సదరు తాగుబోతు ఎవరోగానీ పలుకుబడిగల వ్యక్తేనని అర్ధమయ్యి చెమట్లు పడతాయి స్టేషన్లో పోలీసులకి..

    దాంతో ఎస్సై అయ్యప్పన్ సీ.ఐకి ఫోన్ చేసి చెప్తాడు ఇదీ పరిస్థితి అని..

    ఎందుకొచ్చిన గొడవగానీ అదేంటో తేలేవరకూ ఆ మనిషికి కాస్త సౌకర్యంగా ఉండేలా చూస్కోమంటాడు సీ.ఐ ఆవలిస్తూ..!! ఓ పక్క చూస్తే ఎవరో ప్రభుత్వాధికారిని కొట్టిందని సొంతభార్యనే అరెస్ట్ చేసి బెయిల్ వచ్చేవరకూ స్టేషన్లో కూర్చోబెట్టేంత నిజాయితీపరుడు ఆ అయ్యప్పన్..!!

    ఇక చేసేది లేక అక్కడ్నించి ఆ తాగుబోతు పెద్దమనిషికి సార్ సార్ అంటూ రాచమర్యాదలు మొదవుతాయి.. మనసుకి విరుద్ధంగా ఎస్సై అయ్యప్పన్ స్వయంగా లోపలికి తీసుకెళ్లి మరీ కుర్చీలో కూర్చోబెడతాడు. (పలుకుబడి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడోనన్న భయమే ప్రభుత్వాధికారులతో తప్పులు చేయిస్తుంది.. ఈ పాయింట్ బాగా రిజిష్టర్ అయ్యింది)

    కానీ నలుగురిలోనూ చెంపదెబ్బ తిన్న కోషీ అహం మాత్రం శాంతించదు..

    ఎలాగైనా సరే ఎస్సైకి బుద్ధి చెప్పాలని "తాగకపోతే తన నరాలు చిట్లిపోతాయని" నాటకమాడి సీల్ చేసిన తన మందుబాటిళ్లలో ఒకదాన్ని ఎస్సై చేతే ఓపెన్ చేయించి గ్లాసులో పోయించుకుని ఈ తతంగం మొత్తాన్ని సీక్రెట్టుగా సెల్ఫోన్లో రికార్డు చేస్తాడు..

    పాపం ఇవేమీ తెలీని ఎస్సై గ్లాసులో మందుపోస్తూ ఇంకొక రెండేళ్లలో రిటైర్ కాబోయే తను రాబోయే రిపబ్లిక్ డే రోజున ఉత్తమపోలీసుగా ముఖ్యమంత్రితో మెడల్ కూడా అందుకోబోతున్నానని చాలా మర్యాదగా చెప్తాడు..

    ఊహూ.. కోషీ అయినా తగ్గడు.. ఆఫ్ట్రాల్ ఒక ఎస్సై నన్ను అందరిముందూ చెంపమీద కొడతాడా అనే ఆగ్రహమే ఉంటుంది..

    తర్వాత ఆ వీడియోతో కోషీ ఏం చేస్తాడు..?? వాళ్ళిద్దరి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి అనేది మిగతా కథ..

    సినిమా మొత్తానికి కీలకమైన ఈ స్టేషన్ ఎపిసోడ్ని మటుకు చూసి తీరాల్సిందే..

    చక్కటి థ్రిల్లర్ డ్రామాలకెప్పుడూ మలయాళ చిత్రసీమ పెట్టింది పేరు..!! బడ్జెట్ బలంగా లేకపోవచ్చుగానీ కథాబలం మాత్రం చిక్కగా ఉంటుంది.. లైన్ సరళంగానే ఉన్నాసరే అల్లిక అందంగా వెళ్తుంది..

    Too much ego will kill your talent, career, relationships & also your happiness..

    సింగిల్ లైన్లో చెప్పాలంటే Too much ego can ruin your life అనేది నానుడి..

    ఒక్కోసారి కొన్ని గొడవల్లో మాటామాటా పెరిగాకా పంతాలకి పోయి తప్పు ఎవరిదైనాగానీ మూర్ఖంగా వాదించి లేక ఏదోలా పై చెయ్యి సాధించడానికే చూస్తాం తప్ప మనమే ఓ మెట్టు దిగుదామనుకోం మనలో చాలామంది.. సరిగ్గా ఈ పాయింటునే చక్కగా ఒడిసిపట్టాడు దర్శకుడు శచీ..

    ఎదురుగా ఉన్న తాగుబోతు పలుకుబడి కలిగినవాడని తెలిసినా సరే నిక్కచ్చిగా విధులు నిర్వర్తించే నిజాయితీపరుడైన ఎస్సై, మావో నేపథ్యం కలిగినటువంటి ఆదిమవాసి స్త్రీ అయిన భార్య.. చేస్తోంది తప్పని తెల్సి లోలోపలే మథనపడుతూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే మోతుబరి కోశీ, గొడవని ఎలాగైనా చల్లార్చి మితృడ్ని బయట పడెయ్యాలనుకునే తోటి సిబ్బంది.. వయసుడిగినా సరే పౌరుషం చావని పంతం గల తండ్రి..

    యే సీనూ వృథా అనిపించదు.. యే పాత్రా ఎక్కువైనట్టుండదు.. Well balanced characterizations with simple story..

    కామెడీట్రాకులు, మసాలా గీతాలు కావాలనుకుంటే ఈ సినిమాజోలికెళ్లొద్దు.. అలా కాకుండా ఓ సింపుల్ కథని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్లో సిద్ధంగా ఉంది.. మిస్సవ్వొద్దు..

    ఎందుకో ఓ చిన్న డైలాగ్ చెప్పి ముగిస్తాను ..

    టీవీలో వచ్చిన నిందారోపణలు చూసి ఏడుస్తున్న లేడీ కానిస్టేబుల్ దగ్గరకొచ్చి ధైర్యం చెప్తాడు అయ్యప్పన్..

    "ఏడవకు జెస్సీ.. యూనిఫార్మ్లో ఉన్నావ్.. నిటారుగా నిలబడు.."

    "ఈ యూనిఫార్మ్ వేసుకున్నాకే సర్ నేను జీవితంలో నిలబడగలిగాను.. కానీ ఇప్పుడు..??"

    --------------------------------------

    అన్నట్టు ఈ బ్లాక్బస్టర్ సినిమాని తెలుగులో బాలయ్య/రానాలు హీరోలుగా రీమేక్ చెయ్యబోతున్నారని వార్తలొస్తున్నాయి.. ఎంతవరకూ నిజమో చూడాలి మరి..!!



    Quarantine Special 100+ Telugu shortfilms 

    100+ Telugu Short films Part 1 

     

    100+ Telugu Short films Part 2 

     

    100+ Telugu Short films Part 3 

     

    100+ Telugu Short films Part 4

     

    100+ Telugu Short films Part 5



    Related Posts
    Haribabu Maddukuri
    Popular   in Suggestions
    Too much ego can ruin your life|| Ayyappanum Koshiyum || Quarantine Suggestion By Haribabu Maddukuri
    2488
    Kamadri sathish
    Popular   in Suggestions
    ఏ సెపరేషన్ || ఇరానీ సినిమా
    2287
    • Privacy Policy
    • Sitemap
    2019, made with by filmOYA