నీది నాది ఒకే కధ :
నేటి తరం తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఇంత గొప్పగా నేను పుట్టిన తరువాత ఏ సినిమా లోని చూడలేదు ...
The best emotional సినిమా ... 2016 లో అప్పట్లో ఒకడుండేవాడు
2017 లో అర్జున్ రెడ్డి
2018 లో నీది నాది ఒకే కధ
ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ తండ్రితో తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ...
సినిమాలో కూర్చున్నాను కధ నడుస్తున్నాది సడన్ గా ఒచ్చిన ఒక్క ఎమోషనల్ సీక్వెన్స్ నన్ను నా గతానికి తీసుకుని వెళ్ళింది.
1992 -2006 నాకు మా నాన్న గారికి ఎప్పుడు జరిగే ఒక గొడవ తరువాత ఆయన లేరు ఒకవేళ ఉంది ఉంటే ఈ సినిమా మా ఇంట్లోనే లైవ్ లో చూసేవాడినేమో అనిపించింది.
గొప్ప సినిమాలు పెద్ద సినిమాలు నెలకొకటి వస్తాయి 40 కోట్లు గణిస్తాయి నాలుగు వారాలు ఆడి వెళ్లిపోతాయి.
కానీ ఇలాంటి సినిమాలు సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఒకటి వస్తాయి కానీ జీవితాంతం మన గుండెల్లో ఆడుతూనే ఉంటాయి ...
సినిమా అంటే హీరో కాళ్ళ కింద కెమెరా ... drown షాట్స్ ... unwanted స్కిన్ షోస్ ... కాదు అవన్నీ ఉన్నా కధ కథనం లేకపోతే సినిమాలు ఆడవు ... అవిలేకపోయిన కధ కథనం ఉంటే సినిమాలు ఆడతాయి.
వేణు ఊడుగుల sir ఒక మంచి శిల్పాన్ని తయారు చేశారు ... ఆ శిల్పానికి రంగులు వేసి తన సంగీతంతో మరింత అందంగా తయారు చేశారు Suresh Bobbili sir ...
చిన్న మంచి సినిమాలని చూడకుండా అవి థియేటర్స్ లోంచి వెళ్ళిపోయాక amazon prime లో youtube లో ఎపుడొస్తాయా అని ఎదురుచూడటం ఒక ఆనవాయితీ ఐపోయింది మన అందరికి ...
దయచేసి ఏ సినిమా మాత్రం మిస్ కాకండి ...
మీ గతాన్ని నెమరు వేసుకోడానికో ... మీ ప్రతుతాన్ని మార్చుకోడానికో ... మీ భవిష్యత్తుకు బాట వేసుకోడానికో ముడిట్లో దేనికో ఒక దానికి ఈ సినిమా ఖచ్చితంగా పునాది అయి తీరుతుంది ...
its purely my opinion after watching the film ...
-- జస్టిన్ జగన్నాథ్
