తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడున్న ఒక దురాచారాన్ని కధాంశంగా హేమాంజాని దేవి అడపా సమర్పణ లో విజయ్ మంథా ప్రొడ్యూసర్ గా గంగధర్ అద్వైత దర్శకత్వంలో వచ్చిన ఇండిపెండెంట్ ఫిల్మ్ ఈ మంచి నీళ్ళ బావి.
మంచి నీళ్ళ బావి నటీనటులు సాంకేతిక వర్గంః
సిద్ధూ రెడ్డి, శాంభవి, డాక్టర్ కావూరి శ్రీనివాస్, శ్రీ సాయి చంద్ర కిరణ్, కుమార్, శ్రీమహాలక్ష్మి, దీప్తి ఆరువండి, మాస్టర్ రక్షక్ పటేల్, విక్రమ్ సూర్య,
బ్రహ్మయ్య , అఖిలేష్ కాసాని, శైలేందర్ రెడ్డి భీమిరెడ్డి, సాయికిరణ్ గౌడ్
ప్రొడక్షన్ హెడ్ & కాస్ట్యూమ్స్ డిజైనర్ : హేమాంజని దేవి అడప
ఎడిటింగ్ : అనిల్ జల్లు
డి ఐ : వికాష్ కృష్ణ
సంగీతం : శ్రీ వెంకట్
ఛాయాగ్రహణం : సాయి సంతోష్
సాధారణంగా లఘు చిత్రాలు అనగానే ప్రేమ కథలు, లేదంటే యాక్షన్ కథలు మాత్రమే కనిపిస్తుంటాయి. అతి కొన్ని సందర్బాలలో కొన్ని ప్రత్యేకమైన వి వస్తుంటాయి.అలాంటి ఒక ప్రత్యేకమైనది ఈ మంచి నీళ్ళ బావి.
ఇలాంటి ఒక కథను తెరకెక్కించాలి అంటే ఎంతో శోధన, ఓర్పు ఉండాలి.గంగాధర్ లో ఆ లక్షణాలు అన్నీ ఉన్నట్టూన్నాయ్.అందుకే కాబోలు ప్రతీ సన్నివేశాన్ని, ప్రతీ పాత్రని ఎంతో నేర్పుగా తీర్చి దిద్ద గలిగాడు.
ఇలాంటి కథని నమ్మి డబ్బు పెట్టడం అంటే మాటలు కాదు.లఘు చిత్రాలకు పెట్టే డబ్బు చాలా వరకు తిరిగిరాదు.అందుకే చాలా మంది తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తుంటారు. కానీ విజయ్ మంథా అలా అలోచించలేదు.డబ్బు కన్నా కూడా తనలోని కళాత్మక అభిరుచియే ముక్యం అనుకున్నాడు.అందుకే ఇలాంటి ఒక కథ మన ముందుకు రాగలిగింది.
సాయి సంతోష్ ఛాయాగ్రహణం, అనిల్ జల్లు ఎడిటింగ్, శ్రీ వెంకట్ సంగీతం చాలా ప్లస్ అయ్యాయి. ముక్యంగా ఆర్.పీ. పట్నాయక్ గారు పాడిన పాట, ప్రేమ మాలిని వనం గారు పాడిన పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అనేలా ఉన్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రతీ ఒక్కరు తమ పాత్రలలో ఒదిగిపోయారు.విలన్ గాని, మునెమ్మ గాని తమ కళ్ళతోనే క్రూరత్వం చూపించారు.హిజ్రా పాత్ర ప్రత్యేక ఆకర్షణ.
హీరోయిన్ తన అందంతో అభినయంతో ఆకట్టుకుంటుంది.ముక్యంగా తనని అనుభవించాలి అనుకునుకుంటూ తనని సూటిపోటి మాటలతో సతాయిస్తున్న వారిపై పగ తీర్చుకొనే సీన్లలో చాలా నాచురల్ గా చేసింది. నాయిక ప్రాదాన్యం ఉన్న కథలలో చెయ్యడాని సాధారణంగా హీరొలు అంత సుముకథ వ్యక్తం చెయ్యరు కానీ సిద్దూ రెడ్డి ఒప్పుకుని నటించి మెప్పించాడు.
ప్రతీ పాత్ర, ఇందులో పని చేసిన ప్రతీ వ్యక్తి మనసుపెట్టి ఇలాంటి ఒక గొప్ప కథని మన ముందుకు తీసుకువచ్చినట్టు మనకి అనిపిస్తుంది.కొన్ని దగ్గర్ల లిప్ సింక్ చూసుకొని ఉంటే బాగుండేది.
మంచి ఫిల్మ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిల్మ్ ఈ మంచి నీళ్ళ బావి.
చూడని వాళ్ళ కోసంః
