వెండి తెరను చేరాలి అనుకునేవాళ్లకి లఘుచిత్రాలు ఎంతగా ఉపకరిస్తాయో మనందరికి తెలిసిందే...!
పెళ్ళి చూపులు నుండి మొన్నటి రాజావారు రాణిగారు వరకు ఎందరో స్మార్ట్ తెర ద్వారానే సిల్వర్ తెరకి పరిచయం అయిన సంగతి కూడా తెలిసిందే. ఇపుడు ఆ లిస్ట్ లోకి మరో కుర్ర దర్శకుడు చేరాడు.
కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటే 'అబ్బా, ఏం తీశాడు రా!? అనిపిస్తుంది'. కొన్నిటిని చూస్తుంటే 'అబ్బా, ఎందుకు తీశారు రా అనిపిస్తుంది'. సున్నితమైన ప్రేమ కథలను తీసే వారు కొందరు, విభిన్నమైన కథలను చూపెట్టేవారు కొందరు. సామాజిక అంశాలను స్ప్రుశిస్తూ తీసేవారు కొందరు. అన్నింటినీ కలిపి అందంగా తీసేవారు ఇంకొదరు.
ఆ లాస్ట్ కొందరిలో ఈయన ఒకరు. ఆయనే మన గంగాధర్ అధ్వైత. అధ్వైత గాని, ప్రభాష్ గాడి పెళ్ళిగోల కాని, శివోహం గానీ, మంచినీళ్ళ బావి గాని... వేటికవే భిన్నం, సుమధురం...! ఇపుడు మళ్ళీ అలాంటి కొత్త కథతో రాబోతున్నాడు కాకపోతే ఈసారి స్క్రీన్ సైజ్ మారింది. ఆ సినిమానే సురభి 70MM. పేరు దగ్గర నుండి పోస్టర్ దాకా అన్నీ కొత్తగా ఉన్నాయి.
వినోద్ కుమార్ చౌదరి, అక్షిత శ్రీనివాస్ జంటగా యోగి కత్రి ప్రతినాయకుడిగా శ్లోక, ఉషాంజలి, పవన్, అనిల్, చందు ప్రధాన పాత్రధారులుగా త్వరలో మన ముందుకు రాబోతున్నది. ఇప్పుడు ఇక్కడి వరకు ఆపేద్దాం. అన్నీ ఇపుడే రాసేస్తే ముందు ముందు చాలా రాయలి అందుకే ఆల్ ది బెస్ట్ చెబుతూ....
జై హింద్!