అందరికీ నమస్కారాలు! గత నెల రోజులుగా ఇల్లలోనే ఉండి మనలో క్రియేటీవ్ ఆలోచనలు పురుడు పోసుకున్నాయి. ఇంకా 13 రోజులు మనం ఇల్లలోనే ఉండాలి. ఏం చేద్దాం? ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా సరదాగా కథా రచన పోటి పెడితే ఎలా ఉంటది అనిపించింది. ఊరికె రాయమంటే ఎవరూ రాయరు కదా!? అందుకే నగదు బహుమానం కూడా ఇవ్వాలని నిర్ణయించుకుని మీ ముందుకు వస్తున్నాం.
నియమ నిబంధనలు
1. కథా వస్తువులు గా కుక్క పిల్ల, స్నేహితులు, ఇంజెక్షన్, కెమేరా, యాత్ర, తాత, దేవకన్య లను నిర్ణయించడమైనది.
2. ఈ ఏడింటిని వాడుకొని కథ ని రాయలి.
3. ఒకరు ఎన్ని కథలైనా రాయవచ్చు.
4. కథ ని filmoya.com లోనే రాయాలి.
5. పోస్ట్ కి వచ్చిన లైక్స్ మరియు మంచి కథ రెండు కలిపి విజేతని నిర్ణయించడం జరుగుతుంది.
6. మే 3వ తేదీ లోపు ఎప్పుడైనా ఈ పోటీలో పాల్గొనవచ్చును.
Filmoya.com లో కథ రాయు విధానం
1. మొట్టమొదట లాగిన్ అవ్వాలి. లింక్
2. తరువాత ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి. పోస్ట్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. లింక్
3. టైటిల్ ఇవ్వండి. కవర్ పిక్ మీ ఇష్టం.
4. పోస్ట్ కేటగిరీ మాత్రం Story Contest ని సెలక్ట్ చెయ్యాలి.
5. తరువాత 5000 పదాలకు మించకుండా మీ కథ ని రాయండి.(మీకు అనుకూలమైన దగ్గర రాసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చెయ్యొచ్చు)
6. మీరు కథని ఏ భాష లో అయినా రాయవచ్చు.(తెలుగు, English, Tinglish...)
7. Smilies, Emojies నిషిద్దం.
8. ఇండస్ట్రీ Telugu యే ఉంటది కాబట్టి మీరు మళ్ళీ సెలెక్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు.
9. ఆ తరువాత Tags లో Story Contest అని మాత్రమే రాయాలి. ఒకవేళ వేరే ఏమన్నా రాయాలి అనుకుంటే ఇంగ్లీష్ లోనే రాయాలి. లేని ఎడల మీ పోస్ట్ ప్రచురితం అవ్వదు.
10. ఆ తరువాత Post మీద క్లిక్ చెయ్యండి.
బహుమతులు
- మొదటి విజేత కి 300 రూపాయలు.
- రెండవ విజేత కి 200 రూపాయలు.
అందరికీ శుభాకాంక్షలు. ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి.
ఏమైనా సందేహాలు ఉంటే brc@filmoya.com కి మైల్ చెయ్యండి.