దర్శకరత్న దాసరి గారి ఆత్మ మరణం తరువాత ఆకాశయానం చేస్తుండగా , స్వర్గ దూతలు, యమదూతలు... మేం తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తాం అని వాదానికి దిగారు... అతిపెద్ద బొగ్గు కుంభకోణం చేసాడు కాబట్టి ముందు మేం తీసుకెళ్తాం అని గట్టిగా వాదించి ముందు నరకానికి తీసుకెళ్ళారు...
నరకంలో ప్రవేశించారు దాసరి గారు... అక్కడ పాపులకు ప్రత్యక్షంగా వేస్తున్న శిక్షలను చూసి చిన్నగా నవ్వుకున్నారు... కారణం , తాను 151 సినిమాలు తీయడంలో పడ్డ కష్టం గుర్తొచ్చింది... వాటి ముందు ఈ శిక్షలు ఏపాటి అని అనుకున్నారు ...
మెళ్లిగా ఆయన్ని పాపులను విచారించే క్యూలో నిలుచోబెట్టారు... ఓ సారి అలా యముడి వంక చూసారు ... మన కైకాల సత్యనారయణే దర్జాగా , గంబీరంగా ఉన్నాడే అని అనుకున్నారు .... యముడు పాప పుణ్యాలను విచారించి విచారించి బాగా అలసినట్టు కనిపించారు ...
తను ఎన్నో జటిల సమస్యలను ఎలాంటి అలుపు సొలుపు లేకుండా సులువుగా పరిష్కరించిన సందర్భాలు గుర్తొచ్చాయి ... పాపం యముడు అని లోలోపల అనుకున్నారు ... అలా ఆలోచనల్లో ఉండగానే తన వంతు వచ్చింది ... చిత్రగుప్తుడు పాపల చిట్టాలోంచి దాసరి గారి పేజి ఓపెన్ చేసారు .... ఆయన పరిచయం చదివారు ... యముడు ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు ... అబ్బా , మన తెలుగు సినిమా దిగ్దర్శకుడు దాసరి గారు ఈనేనా ... అహ ఏమి నా భాగ్యము అనుకుంటూ ... యముడ్ని ఎంతో గొప్పగా చూపిస్తూ, మమ్మల్ని ప్రధాన పాత్రధారునిగా ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన తెలుగు సినిమా అంటే మాకు ఎంతో ప్రీతీ ... అలాంటి పరిశ్రమ నుండి వచ్చిన దర్శ'కులపెద్ద'ను చూడడం మాకు నిజంగా ఆనందదాయకం అని .... దాసరి గారిని కుశల ప్రశ్నలు అడిగాడు యముడు ... తరువాత , విచారణ ప్రారంభించు అని చిత్రగుప్తుడిని ఆదేశించారు .... చిత్రగుప్తుడు ఇలా చదవడం మొదలెట్టాడు ... ఏమని చెప్పను ప్రభు ఈన చేసిన పాపాలు ... ఒక్కటా ? రెండా ?
ఈన దర్శకత్వం వహించిన సినిమాల చిట్టా ఒక్కసారి వినండి ...
తాత మనవడు (1972)
సంసారం సాగరం (1973)
బంట్రోతు భార్య (1974)
ఎవరీకి వారే యమునా తెరే (1974)
రాధమ్మ పెల్లి (1974)
తిరుపతి (1974)
స్వర్గం నారకం (1975)
బలిపీఠం (1975)
భారతంలో ఒక అమ్మాయి (1975)
దేవుడే దిగివస్తే (1975)
మనుషులంతా ఒకటే (1976)
ముద్దబంతి పువ్వు (1976)
ఓ మనిషి తిరిగిచూడు (1976)
తూర్పు పడమర (1976)
యవ్వనం కాటేసింది (1976)
బంగారక్క (1977)
చిల్లర కొట్టు చిట్టెమ్మా (1977)
ఇదెక్కడి న్యాయం (1977)
జీవితమే ఒక నాటకం (1977)
కన్యా కుమారి (1978)
దేవాదాసు మళ్ళీ పుట్టాడు (1978)
కటాకటా ల రుద్రయ్య (1978)
శివరంజని (1978)
స్వర్గ్ నరక్ (1978)
గోరింటా కు (1979)
కళ్యాణి (1979)
కొరికలే గుర్రాలైతే (1979)
నీడ(1979)
పెద్ది ల్లు చిన్నిల్లు (1979)
రావణుడే రాముడైతే (1979)
రంగూన్ రౌడీ (1979)
జ్యోతి బనే జ్వాలా (1980)
బండోడు గుండమ్మా (1980)
భోలా శంకరుడు (1980)
బుచ్చి బాబు (1980)
సర్కస్ రాముడు (1980)
దీపరాధన (1980)
ఎడంతస్తుల మేడ (1980)
కేటు గాడు (1980)
నాతిచరామి (1980)
పాలు నీళ్ళు (1980)
సర్దార్ పాపా రాయుడు (1980)
సీత రాములు (1980)
శ్రీవారి ముచ్చట్లు (1980)
యే కైసా ఇసాఫ్ (1980)
విశ్వరూపం (1981)
స్వాప్నా (1981)
ప్యాసా సావన్ (1981)
సంగీత్ (1981)
అద్దాల మేడ (1981)
ప్రేమాభిషేకం (1981)
ప్రేమ మందిరం (1981)
బొబ్బిలి పులి (1982)
గోల్కొండ అబ్బులు (1982)
జగన్నాథ రథచక్రాలు (1982)
జయసుధ (1982)
కృష్ణార్జునులు (1982)
మెహందీ డాంగ్ లాయేగీ (1982)
ఓ ఆడది ఓ మగడు (1982)
రాగ దీపమ్ (1982)
స్వయంవంరం (1982)
యువరాజు (1982)
ప్రేమ్ త్యాసియా (1983)
బహుదూరపు బాటసారి (1983)
మేఘ సందేశం (1983)
M.L.A. ఎడుకొండలు (1983)
పోలీస్ వెంకటస్వామి (1983)
రాముడు కాదు కృష్ణుడు (1983)
రుద్రకాళీ (1983)
ఊరంత సంక్రాంతి (1983)
యాద్గార్ (1984)
ఆశా జ్యోతి (1984)
ఆజ్ కా M.L.A. రామ్ అవతార్ (1984)
అభిమన్యుడు (1984)
హాసియత్ (1984)
జగన్ (1984)
జస్టిస్ చక్రవర్తి (1984)
పోలీస్ పాపన్న (1984)
యుద్ధం (1984)
జక్మీ షేర్ (1984)
రానా (1984)
సర్ఫారోష్ (1985)
వఫాదా ర్ (1985)
బ్రహ్మముడి (1985)
ఏడడుగుల బంధం (1985)
లంచావతారం (1985)
పెళ్లి మీకు అక్షింతల నాకు (1985)
తిరుగుబాటు (1985)
ఆది దంపతులు (1986)
ధర్మ పీఠం దద్దరిల్లింది (1986)
తాండ్ర పాపారాయుడు (1986)
ఉగ్ర నరసింహం (1986)
ఆత్మ భందువులు (1987)
బ్రహ్మ నాయుడు (1987)
మజ్ను (1987)
నేనే రాజు నేనే మంత్రి (1987)
విశ్వనాథ నాయకుడు (1987)
బ్రహ్మ పుత్రుడు (1988)
ఇంటింటి భాగవతం (1988)
కాంచన సీత (1988)
ప్రజా ప్రతినిధి (1988)
లంకేశ్వరుడు (1989)
బ్లాక్ టైగర్ (1989)
నా మొగుడు నాకే సోంతం (1989)
టూ టౌన్ రౌడీ (1989)
మామా అల్లుడు (1990)
అభిసారిక (1990)
అమ్మ రాజినామ (1991)
నియంత (1991)
రాముడు కాడు రాక్షసుడు (1991)
అహంకారి (1992)
సూరిగాడు (1992)
సబ్బారాయూడీ పెల్లి (1992)
వెంకన్నా బాబు (1992)
లేడీ ఇన్స్పెక్టర్ రేణుక (1993)
సంతాన్ (1993)
అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)
కుంతీ పుత్రుడు (1993)
మామా కోడలు (1993)
బంగారు కుటుంబం (1994)
నాన్నగారు (1994)
కొండపల్లి రత్తయ్య (1995)
మాయా బజార్ (1995)
ఒరేయ్ రిక్షా (1995)
కళ్యాణ ప్రాప్తిరస్తు (1996)
రాయడుగారు నాయుడు గారు (1996)
ఒసేయ్ రాములమ్మ (1997)
రౌడీ దర్బార్ (1997)
గ్రీకు వీరుడు (1998)
పిచ్చోడి చేతిలో రాయి (1999)
ఆడవి చుక్క (2000)
కంటే కూతుర్నే కను (2000)
సమ్మక్క సారక్క (2000)
చిన్నా (2001)
కొండవీటి సింహసనం (2002)
రైఫిల్స్ (2002)
ఫూల్స్ (2003)
యంగ్ ఇండియా (2010)
పరమ వీర చక్ర (2011)
ఎర్ర బస్ (2014)
ఇలా పేర్లు చదివి అలిసి పోయి చిత్రగుప్తుడు ఒక నలుగు గ్లాసులు నీళ్ళు తాగాడు ... యముడి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యి ... ఏంటి ఒక మానవుడు ... తన జీవిత కాలంలో ఇన్ని సినిమాలకు దర్శకత్వం చేసినాడా ? ఏంటి అద్భుత చమత్కార ప్రతిభ ? దాసరి గరినుద్దేశించి , ఆర్యా ! ... ఒక్క రోజైనా పడుకున్నారా ? లేక అదేపనిగా కష్టపడి అందరిని కష్టపెట్టినారా ? ... ఏ దేమైనను ఇది అసాధారణ కార్యమే ! ... హు ... అ తరువాత అన్నాడు యముడు ... అంతేనా ప్రభు ! చాలా సినిమాల్లో నటించాడు కూడా ...ఒక్కసారి అవి కూడా వినండి అని ఇలా చదవడం మొదలెట్టాడు ...
మానవతి (1952)
స్వర్గం నరకం (1975)
యవ్వనం కాటేసింది (1976)
శివరంజని (1978)
పెద్దిల్లు చిన్నిల్లు (1979)
భోలా శంకరుడు (1980)
పాలు నీళ్ళు (1980)
అద్దాల మేడ (1981)
జయసుధ (1982)
స్వయంవరం (1982)
యువరాజు (1982)
బహుదూరపు బఠాసరి (1983)
M.L.A. ఎడుకొండలు (1983)
పోలీస్ వెంకటస్వామి (1983)
ఊరంత సంక్రాంతి (1983)
జగన్ (1984)
పోలీస్ పాపన్న (1984)
లంచవతారం (1985)
ఆత్మ భంధువులు (1987)
రొటేషన్ చక్రవర్తి (1987)
ఇంటింటి భాగవతం (1988)
నా మొగుడు నాకే సొంతం (1989)
మామా అల్లుడు (1990)
అమ్మ రాజినామ (1991)
సూరిగాడు (1992)
మమగారు (1991)
సీతరామయ్య గారి మనవరాలు (1991)
వెంకన్నా బాబు (1992)
రగులుతున్న భారతం (1992)
పెళ్ళాం చాటు నా మొగుడు (1992)
పర్వతాలు పానకాలు (1992)
చిన్నల్లడు (1993)
మామా కోడలు (1993)
లేడీస్ స్పెషల్ (1993)
బంగారు కుటుంబం (1994)
నాన్నగారు (1994)
పుణ్య భూమీ నా దేశం (1994)
ఓ తండ్రి ఓ కొడుకు (1994)
కొండపల్లి రత్తయ్య (1995)
మాయా బజార్ (1995)
ఒరేయ్ రిక్షా (1995)
శుభమస్తు (1995)
మాయదారి కుటుంబం (1995)
మధ్య తరగతి మహాభారతం (1995)
ప్రేమకు పది సూత్రాలు (1995)
రాయడుగారు నాయుడుడురు (1996)
ఒసేయ్ రాములమ్మ (1997)
హిట్లర్ (1997)
రుక్మిని (1997)
దీర్ఘ సుమంగలిభవ (1998)
గ్రీకు వీరుడు (1998)
సుబ్బ రాజాగారి కుటుంబం (1998)
పిచ్చోడి చేతిలో రాయి (1999)
కంటే కూతుర్నే కను (2000)
సమ్మక్క సారక్క (2000)
చిన్నా (2001)
అధిపతి 2001)
కొండవీటి సింహసనం (2002)
ఫూల్స్ (2003)
మేస్త్రి (2009)
యంగ్ ఇండియా (2010)
ఝుమ్మంది నాదం (2010)
పాండవులు పాండవులు తుమ్మెదా (2014)
ఎర్ర బస్ (2014)
అని చదివి ఈసారి సృహ కోల్పోయి పడిపోయాడు చిత్రగుప్తుడు ... నీళ్ళు చల్లి లేపగా , ఓ నాలుగైదు గ్లాసులు రస్నా తాగి తేరుకొని ... ఇక చదవడం నా వాళ్ళ కాదు అంటాడు ... ఏంటి ఇంకా అవ్వలేదా అని యముడు ఆశ్చర్యపోతాడు ... ఎక్కడ ప్రభు ...ఈనాగారి ఘనకార్యాలు అన్నా ఇన్నా ! బోలెడు అనంటాడు చిత్రగుప్తుడు ... దాసరి గారిని చూసి , ఏంటి మహానుభావా ? మీ వంట్లో ఆ శక్తి ఏంటి? అని ఆశ్చర్యంగా చూసి ... చిత్రగుప్తుడిని ఇంకా చదవమంటాడు ... నా వల్ల కాదు అంటే , చిత్రగుప్తుడికి ఒక రెడ్ బుల్ తెప్పించి ఇచ్చి , తాగి చదవమంటాడు ... రెడ్ బుల్ తాగి , ఈనాగారి లీలలు, పనులూ అన్నిన్ని కావు ప్రభు అని ఇలా చదువుతాడు ...
మొహమ్మద్-బిన్-తుగ్లక్ (1972)
హంతకుల దేవాంతకులు (1972)
మాతృమూర్తి (1972)
పంజరంలో పసిపాప (1973)
కుడి ఎడమైతే (1979)
బంగారు కొడుకు (1982)
నాంపల్లి నాగు (1986)
రొటేషన్ చక్రవర్తి (1987)
ఆదివారం ఆడవాళ్ళకు సెలవు (2007)
మైసమ్మ IPS (2007)
ఆది విష్ణు (2008)
మేస్త్రి (2009)
బంగారు బాబు (2009)
ఇత్యాది సినిమాలకు రచయితగా పనిచేసాడు ...
శివరంజని (1978)
సుజాత (1980)
జయసుధ (1982)
మేఘ సందేశం (1982)
బహుదూరపు బాటసారి (1983)
జస్టిస్ చక్రవర్తి (1984)
పెళ్లి నీకు అక్షింతలు నాకు (1985)
ఉగ్ర నరసింహం (1986)
మజ్ను (1987)
రొటేషన్ చక్రవర్తి (1987)
అయ్యప్ప స్వామి జన్మా రహస్యం (1987)
ఇంటింటి భాగవతం (1988)
మామా అల్లుడు (1990)
ఒరేయ్ రిక్షా (1995)
రాయడుగారు నాయుడుగారు (1996)
రౌడీ దర్బార్ (1997)
ఒసేయ్ రాములమ్మ (1997)
గ్రీకు వీరుడు (1998)
కంటే కూతుర్నే కను (2000)
సమ్మక్క సారక్క (2000)
చిన్నా (2001)
కొండవీటి సింహసనం (2002)
రైఫిల్స్ (2002)
బంగారు బాబు (2009)
#ఇత్యాది_చిత్రాలు_నిర్మించి....
విశ్వామిత్ర (TV సీరియల్ ) (1991)
అభిషేకం (ETV)
గోకులంలో సీత (ETV)
#ఇలాంటి_TV_సిరీస్లు_చేసి ....
మనుషులంతా ఒక్కటే (1976)
బుచ్చి బాబు (1980)
సీతారాములు (1980)
విశ్వరూపం (1981)
ప్రేమాభిషేకం (1981)
స్వప్నా (1981)
స్వయంవరం (1982)
యువరాజు (1982)
రాముడు కాదు కృష్ణుడు (1983)
యుద్ధం (1984)
ఉగ్ర నరసింహం (1986)
మజ్ను (1987)
బ్రహ్మ పుత్రుడు (1988)
లంకేశ్వరుడు (1989)
సూరిగాడు (1992)
గ్రీకు వీరుడు (1998)
కంటే కూతుర్నే కను (2000)
సమ్మక్క సారక్క (2000)
మైసమ్మ IPS (2007)
#ఇత్యాది_సినిమాలకి_పాటలు_రాసి ...
ఆ పని , ఈ పని అని కాకుండా అన్ని పనులు చేసి ఎవ్వరికీ పని దొరక్కుండా చేసి పాపం చేసాడు ప్రభు ... ఈ వివరాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి ప్రభు ... మన దగ్గర సరైన వివరాలు లేక గూగుల్ తల్లి సాయంతో వికీపీడియా నుండి తీసుకుంటిని ... అక్కడ దొరికిన ఈ సమాచారం అసంపూర్ణం... అయినా ఈ వివరాలు చాలు ప్రభు ఈనాగారి గురించి తెలుసుకోడానికి ... అంతేకాదు ప్రభూ ! రాజకీయంలో చేరి మంత్రి పదివిని కుడా అధిష్టించాడు అని ఆయాసపడుతుంటాడు చిత్రగుప్తుడు ...
తిరిగి చూసేలోగా యముడు వచ్చి దాసరి గారి కాళ్ళమీద పడి ... ఓ మహానుభావా ! బహుముఖ ప్రజ్ఞ్యాపాటవా! మీ దర్శన భాగ్యంతో నేడు మా యమలోకం పావనమైనది ... నా జన్మ చరితార్థమైంది... ఇక్కడ నేను ఈ పాప విచారణ అన్న ఒక్క పనే సరిగ్గా చేయలేక అలసిపోతున్నాను ... మీరు ఇంత అతి తక్కువ జీవన కాలమున ఇన్ని పనులు ఎలా చేయగలిగారు ... మీరు నభూతో న భవిష్యత్... మీరు అనంతమైన కష్టానికి , ప్రతిభకి నిలువెత్తు రూపం ... ఇన్ని గొప్ప పనులు , ఘన కార్యాలు చేసిన మీరు నరకానికి రావడమేమి ... మా పాపాల చిట్టాలో ఎక్కడో ఏదో తప్పు జరిగినది ... చిత్ర గుప్తా ! ఏ పాపమున వీరిని ఇక్కడికి రప్పించితివి ? అని గట్టిగా అరుస్తాడు ... ఆ అరుపులకు ఉలిక్కిపడిన చిత్రగుప్తుడు , పాపాల చిట్టాలో ఏదో దిద్దుతూ కనిపిస్తాడు ... అది చూసిన కొంతమంది మన సినిమా వాళ్ళు పట్టుకొని యముడికి చెబుతారు ... యముడు పాపాల చిట్టా చేతికి తీసుకుని చూస్తే ... బొగ్గు కుంభకోణం గురించి చెరిగిపోయిన అక్షరాలను దిద్దడం కనిపిస్తుంది ... అది చూసి, మచ్చలేని వాడి పైకి అతీగతీ లేని ఈ పాపాన్ని కొత్తగా నెట్టావా ? నువ్వూ ఆ మహానుభావున్ని బలి పశువుని చేస్తున్నావా ? ఈ పాపంలో ఆయనకు ఏ సంభంధం లేదు అని అరిచి ... దాసరి గారిని క్షమించమని వేడుకొని అన్ని రకాల అతిథి సత్కారాలతో స్వర్గలోకానికి సాగనంపుతారు ...
స్వర్గానికి వెళ్ళగానే అక్కడే ఉన్న మన అతిరథ మహారథులు ... ఎన్టీఆర్ , ఎఎన్నాఆర్ , నాగయ్య , ఎస్వీఆర్, భానుమతి , సావిత్రి , రేలంగి, రాజబాబు, సూర్యకాంతం , కెవి.రెడ్డి , బి.ఎన్.రెడ్డి ఇత్యాది వాళ్ళు ఆనందంతో ఎగిరి గంతేశారు ... వాళ్ళను చూసిన దాసరి గారి కళ్ళల్లో ఆనందం ... అక్కడ ఒక రెండు మూడు నెలలు గడిచాక దాసరి గారికి బోర్ కొట్టేసింది... ఎప్పుడూ పని చేస్తూ కష్టపడే అలవాటు కదా ... అక్కడ ఏ పని లేకుండా సుఖంగా ఉండలేకపోయారు ... పైగా ఎన్నో సమస్యలను తనవిగా చేసుకొని సులభంగా పరిష్కారం చేసిన మనిషి కదా ... అక్కడ ఉండబట్టలేక , ఇంద్రుడి పర్మిషన్ తీసుకొని యమలోకానికి వెళ్లి కొన్ని చిన్న చిన్న కేసులు నాకు అప్పగిస్తే పరిష్కరిస్తానని చెప్పి కోరతారు ... యముడు అలాగే ఇస్తాడు ... అలవాటు ప్రకారంగా , ఏమాత్రం అలుపులేకుండా ఎలాంటి కేసునైనా సులభంగా విచారించి పరిష్కారం చేస్తున్నారు ,,, అది చూసి యముడు ఎక్కువ కేసులు బదిలీ చేయడం చేసారు ... ఎన్ని కేసులైనా అదే ఉత్సాహం , అదే చాకచక్యం ... ఓ శుభ ముహూర్తాన యముడు ఇక తన కేసులన్నీ అప్పజెప్పి తాను తెలుగు సినిమాల్లో నటిద్దామని హైదరాబాదు వచ్చేసాడు ... దాసరి గారు విచారణ చేస్తూ కొత్త కొత్త పరిష్కరాలను చూపుతూ అలా పాప ప్రక్షాళన చేస్తున్నారు...
అనితర సాధ్యమైన ప్రతిభాశాలి , శ్రమజీవి, దిగ్దర్శకులు, దిక్సూచి, మార్గదర్శి దాసరి గారి ఆత్మ శాంతి చేకూరాలని అశ్రు నయనాలతో ఈ అక్షర నివాళి ...??- V Yeshasvee Ssv
